- హీరో శివాజీ
ప్రముఖ నటుడు శివాజీ నిర్మాతగా, హీరోగా శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న క్రైమ్ కామెడీ ఫ్యామిలీ థిల్లర్ చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఇంతకు ముందు శివాజీ గారితో పలు హిట్ చిత్రాల్లో నటించి హిట్ జోడిగా ఖ్యాతి పొందిన శివాజీ, లయలు ఈ సినిమాలో మరోసారి జోడిగా కనిపిస్తున్నారు.

శివాజీ, ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటిలు తమ సంస్థల ద్వారా మార్చి 6న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా
హీరో, నిర్మాత శివాజీ మాట్లాడుతూ ” సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మార్చి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లో రిలీజ్ కానుంది. లక్కీ కాంబినేషన్ ఈటీవీ విన్, బన్నీవాస్, వంశీ నందిపాటి ఆధ్వర్యంలో ఈ సినిమా విడుదల కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను మొదటగా థియేటర్ కోసమే ప్రారంభించాం. . ఈసినిమాను అనుకున్నది అనుకున్నట్టుగా తీశాం. ఈటీవీ వాళ్లకు ఏది చెప్పమో అదే తీశాం. సినిమాకు ఉండే థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌లో మాజా వేరు. థియేటర్‌లో చూస్తేనే కిక్కు. ఇంత మంచి కంటెంట్ ఈటీవీ వర్జినల్‌లో ఫ్రెష్ కంటెంట్ వాళ్ల ఓటీటీకి కావాలనుకున్నారు.

కానీ ఈ సినిమాను థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనుకున్నాం. అందుకే థియేటర్‌లో విడుదల చేస్తున్నాం. బన్నీవాస్ సినిమా చూసి మెచ్చుకున్నారు. వంశీ గారికి కూడా నచ్చింది. సినిమా చూసిన వాళ్లంతా హిలేరియస్‌గా నవ్వుకున్నారు. ఫైనల్‌గా ఇది థియేటర్‌లోకి రావాలని డిసైడ్ చేశాం. ఈ సినిమానే తనకు కావాలిసింది చేసుకుంది. థియేటర్‌కు వస్తుంది. ఓ మంచి సినిమా, అందరికి నచ్చే సినిమా తీశానని ధైర్యంగా చెప్పగలను. అందరూ ప్రేమించి చేసిన సినిమా ఇది. ఇది అందరి ప్రేమను పొందుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా థియేటర్‌లో రావడానికి కారణమైన దర్శకుడు అనిల్ రావిపూడికి నా కృతజ్ఞతలు ‘ అన్నారు.
ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ మాట్లాడుతూ ” ఈ సినిమాలో శివాజీ, లయ గారు చాలా గ్యాప్ తరువాత కలిసి నటించడం హ్యపీగా ఉంది. ఈసినిమా క్రైమ్ కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్. ఈ సినిమాను అందరూ థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. తప్పకుండా సినిమా అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.
కథానాయిక లయ మాట్లాడుతూ ” ఓటీటీలో వస్తుంది ఈ సినిమా అనగానే ఒక హ్యపీనెస్‌తో పాటు ఎక్కడో ఒక అసంతృప్తి ఉండేది. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే థియేటర్ అనే అలవాటు.. ఈ సినిమా థియేటర్‌లో చూడలేకపోతానేమో అని బాధ ఉండేది. కానీ ఇప్పుడు ఈసినిమా థియేటర్‌లో రిలీజ్ కావడం ఆనందంగా ఉంది. దీనికి కారణమైన అందరికి నా కృతజ్ఞతలు. నాకు ఈసినిమా ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే హ్యపీ టెన్షన్ ఉంది.
సినిమా అందరికి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో అన్ని అంశాలు సినిమావిజయానికి ప్లస్ అయ్యే విధంగా ఉంటుంది. నాకు కూడా సినిమాను చూడాలని ఉంది. ప్రేక్షకుల లాగానే నేను కూడా ఎదుచుచూస్తున్నాను. ఈ సినిమాతో నా సెకండ్ ఇన్నింగ్స్‌కు మంచి శ్రీకారం అని నమ్ముతున్నాను. ఈ సినిమాను అందరూ థియేటరలోనే చూడాలి. థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌లో ఎమోషన్ ఉంటుంది’ అన్నారు.
బన్నీవాస్ మాట్లాడుతూ ” ఈ సినిమా విడుదల చేయడానికి కారణం దర్శకుడు అనిల్ రావిపూడి గారు. ఈ సినిమాను చూసిన ఆయన ఇది పక్కా థియేట్రికల్ సినిమా, థియేటర్‌లో రిలీజ్ చేయమని చెప్పారు. శివాజీ గారు కూడా ఇచ్చిన ధైర్యంతో ఈ సినిమాను థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా చూశాను. శివాజీ గారు నటన మిమ్ములను ఆకట్టుకుంది.
90స్ సినిమా తరువాత ఆయన ఇంకో స్థాయికి వెళ్లాడు.ఈ సినిమాలో లయ బాగా నటించిరు. ఆమె పాత్ర అందరికి గుర్తుండిపోతుంది. ఈ ఇద్దరి కాంబో మరోసారి సక్సెస్‌ఫుల్ కాబోతుంది. ఈసినిమాలో క్రైమ్ థ్రిల్లర్ కాంబినేషన్‌లో ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. ఈటీవీ కాంబినేషన్‌లో మేము మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. వారితో మా ప్రయాణం ఇలాగే కొనసాగాలి అన్నారు.
వంశీ నందిపాటి మాట్లాడుతూ ” శివాజీ, లయది హిట్ కాంబినేషన్ మరోసారి ఈ జంట ఈసినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ జంట అప్పుడు ఎలా ఉన్నారో.. ఇప్పుడు ఇలాగే ఉన్నారు. లయ నా అభిమాన నటి. నా అభిమాన నటి సినిమాతో అసోసియేట్ అవ్వడం ఆనందంగా ఉంది. ఈ సినిమా థ్రిల్లర్ అండ్ ఎంటర్‌టైనర్. ఈ టీవీ ట్రేడ్ మార్క్ సినిమా ఇది. ఈ సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.
దర్శకుడు సుధీర్ శ్రీరామ్ మాట్లాడుతూ ” ఈ సినిమా ఓటీటీ సినిమా అనుకున్నప్పుడు ఓ మిరాకిల్‌లా అనిల్ రావిపూడి ఈ సినిమాను చూడటం. ఆయన సలహాతో ఈ సినిమా థియేటర్‌లోకి తీసుకరావాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈటీవీ సాయి గారు, శివాజీ గారు ఒప్పుకోవడం నిజంగా మిరాకిల్‌గా అనిపించింది. ఈ సినిమా ఏది కావాలో అది చేసుకుంది. మంచి కంటెంట్ థియేటర్స్‌ను వెతుక్కుంది. త్వరలోనే ఓ కొత్త ట్రైలర్‌ను విడుదల చేస్తున్నాం
అలీ మాట్లాడుతూ ” సాంప్రదాయబద్దంగా సుత్తి లేకుండా పూస గుచ్చినట్లు ఈ సినిమాను దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు. మార్చి 6న అందరూ ఈ సినిమాను థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. అనిల్ రావిపూడి ఈ సినిమాను థియేటరలో రిలీజ్ చేయమనడం, వంశీ, బన్నీవాస్‌లు విడుదల చేయడం ఆనందంగా ఉంది. హిట్ పెయిర్ శివాజీ, లయల కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది’ అన్నారు.
నటీనటులు : శివాజీ, లయ , అలీ ధనరాజ్ , ప్రిన్స్, జబర్దస్ ఇమ్మాన్యుయేల్, రాజ్ తిరందాసు , కరణ్ తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : శ్రీ శివాజీ ప్రొడక్షన్స్
నిర్మాత : శివాజీ సొంటినేని
రచన – దర్శకత్వం : సుధీర్ శ్రీరామ్
సంగీత దర్శకుడు : రంజిన్ రాజ్
ఎడిటర్ : బాలు మనోజ్.డి
కెమెరామెన్ : రిత్విక్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ప్రసాద్ లింగం, ధీరజ్.పి
కో డైరెక్టర్ : గుడివాక శివ కుమార్
ప్రొడక్షన్ కంట్రోలర్ : బాలాజీ శ్రీను కరెడ్ల
