Thursday, March 26, 2026
Homeవరంగల్‌Medaram | గద్దెలపైకి సమ్మక్క తల్లి

Medaram | గద్దెలపైకి సమ్మక్క తల్లి

అద్బుతంగా జరుగుతున్న మేడారం మహాజాతర(Medaram Mahajatara)లో గురువారం ప్రధాన ఘట్టం(Main Event) విజయవంతంగా పూర్తయింది (Successfully completed). చిలకలగుట్ట వద్ద ఘనంగా పూజలు అందుకున్న తర్వాత సమ్మక్క అమ్మవారు(Sammakka Ammavaru) జనంలోకి వచ్చారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల జయజయ ధ్వానాల మధ్య ఆ తల్లి మేడారం గద్దెలపైకి చేరుకున్నారు. సమ్మక్క తల్లికి మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌, ప్రభుత్వ ఉన్నత అధికారులు వైభవంగా స్వాగతం పలికారు. గౌరవ సూచకంగా ఎస్పీ గాల్లోకి కాల్పులు(Sp gun Fire) జరిపారు. పోలీసులు గౌరవ వందనం చేశారు. డోలు వాయిద్యాలు, ఎదురుకోళ్లతో భక్తులు సమ్మక్కకు మనస్ఫూర్తిగా స్వాగతం పలికారు. ఇప్పటికే సారలమ్మ అమ్మవారు, పగిడిద్ద రాజు, గోవిందరాజు.. గద్దెలపైకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 31 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర బ్రహ్మాండంగా కొనసాగనుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News