- జలమండలి అధికారులతో మాజీ కార్పొరేటర్ హేమ పర్యటన
బీదల బస్తీలో కలుషిత నీరు వస్తున్నదని స్థానికులు మాజీ కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ దృష్టికి తేవడంతో వెంటనే స్పందించడం జరిగిందన్నారు.సమస్య తీవ్రతను గుర్తించిన ఆమె జలమండలి అధికారులతో కలిసి ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న డాక్టర్ సామల హేమ,కలుషిత నీటి కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
సమస్యను తక్షణమే పరిష్కరించాలని సూచిస్తూ పైపులైన్‌లను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని జలమండలి అధికారులకు ఆదేశించారు.ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని జలమండలి అధికారులు హామీ ఇచ్చారు.
భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డాక్టర్ సామల హేమ అధికారులను కోరారు.ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని,వాటి పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తామని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ కుషాల్ తదితరులు పాల్గొన్నారు.
