Wednesday, February 11, 2026
Homeక్రైమ్ వార్తలుSajjanar | రీల్స్‌లో బిల్డప్.. రియాలిటీలో ఫ్రాడ్!

Sajjanar | రీల్స్‌లో బిల్డప్.. రియాలిటీలో ఫ్రాడ్!

లక్కీ డ్రా ఇన్‌ఫ్లుయెన్సర్ల(Lucky Draw Influencers) పట్ల జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్(Hyderabad Police Commissioner) సజ్జనార్ సూచించారు. సోషల్ మీడియా(Social Media)లో కొంత మంది ఇన్ఫ్లూయెన్సర్లు.. కార్లు, బైకులు, ప్లాట్లు ఇస్తామంటూ లక్కీ డ్రాల పేరుతో మోసాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల దందా బంద్ కావడంతో లక్కీ డ్రాలు అంటూ కొత్త వేషాలతో వీళ్లు దర్శనమిస్తున్నారని తెలిపారు. అమాయక ప్రజల ఆశలను ఆసరాగా చేసుకొని నిండా ముంచుతున్న ఇన్ఫ్లూయెన్సర్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. The Prize Chits and Money Circulation Schemes(Banning) Act-1978 ప్రకారం కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. మోసాలకు పాల్పడేవారు సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా స్టార్లైనా సరే.. ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పాపులారిటీని అడ్డంపెట్టుకొని ప్రజలను దోచుకుంటే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News