Friday, October 3, 2025
ePaper
HomeతెలంగాణSadar | యాదవుల సాంస్కృతిక ప్రతీక.. సదర్

Sadar | యాదవుల సాంస్కృతిక ప్రతీక.. సదర్

  • నిజాం కాలం నుంచే అంగరంగా వైభవంగా సదర్ ఉత్సవాలు
  • సదర్ ఉత్సవాలకు ప్రభుత్వం రూ.25 కోట్లు కేటాయించాలి
  • తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరిన యాదవ సంఘాలు
  • అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వంకు విజ్ఞప్తి

తెలంగాణలో ఘనంగా జరుపుకునే పండుగల్లో సదర్ సమ్మేళన్ ఒకటి. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోతో గతేడాది నుంచి ఈ సదర్ పండుగ తెలంగాణ రాష్ట్ర పండుగల్లో ఒకటిగా నిలిచింది. దీపావళి తర్వాతి రోజు జంటనగరాల్లో యాదవ సామాజిక వర్గం అత్యంత వైభవంగా ఈ సదర్ ఉత్సవాలు నిర్వహిస్తారు. బఫెలో కార్నివాల్‌గా పిలువబడే సదర్ పండుగ వేడుకల కోసం రూ. 25 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థించారు.

ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీపావళి అంటే యాదవులకి అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న పండగన్నారు. పండుగ తర్వాతి రోజు ఒక గొప్ప కార్యక్రమంగా సదర్ సమ్మేళనంను నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాలకు నిజాం కాలంలోనూ ఆదరణ దక్కిందన్నారు. ఇందుకు అన్ని విధాలుగా యాదవులను నిజాం సైతం ప్రోత్సహించేవారు.. ఉత్సవాలను స్వయంగా నిజాం తిలకించేవారని తెలిపారు. కొన్ని సంవత్సారాల నుంచి ఈ పండుగను రాష్ర పండుగ చేయాలనీ విజ్ఞప్తి చేయడం జరిగింది, అయితే సీఎం రేవంత్ రెడ్డి గతేడాది రాష్ట్ర పండుగా ఒప్పుకోవడం జరిగిందన్నారు. దానికి అనుబందంగా జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పుడు యాదవుల నుంచి ప్రభుత్వంకు విజ్ఞప్తి చేసుకోవడం గల కారణం ఈఏడాది జరిగే సదర్ సమ్మేళన నిర్వహణకు రూ.25 కోట్లు ప్రకటించాలనీ కోరారు. ఎందుకంటే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ప్రాంతాల్లో నిర్వహించే ఈ ఉత్సవాల కోసం 200 స్వాగత వేదికలు ఏర్పాటవుతాయి. ఆ వేదికపైనే యాదవులు, సామాజిక పెద్దలు సమ్మేళనం నిర్వహించే వారికి సన్మానం చేస్తారు. ఈ వేదికల నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్నదన్నారు.

ఉత్సవాల్లో భాగంగా వేదిక దగ్గరకు యాదవులు స్వయంగా తమ ఖర్చులతో దున్నపోతులను అలంకరించుకొని తీసుకొస్తారు. అలా ప్రతి ఏడాది ఈ ఉత్సవాలను అంగరంగా వైభవంగా నిర్వహించేందుకు కృషి చేసే వారికి ఆర్థికంగా ప్రోత్సహించాలని యాదవుల సంఘం నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం అందించే రూ.25 కోట్ల డబ్బును వారికి అందించాలన్న ఉద్దేశం ఉందన్నారు. ప్రభుత్వం ఈ డబ్బును ముందస్తుగా విడుదల చేస్తే లోకల్ కమిటీల ద్వారా క్రమపద్దతిగా అర్హులను గుర్తించి ఇవ్వడం జరుగుతుంది. వచ్చే నెలలోనే సదర్ ఉత్సవాలు సమీపిస్తున్నందున తక్షణమే రూ.25 కోట్లు విడుదల చేసినట్లయితే హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా అందరు యాదవులు సంతోషంగా సదర్ పండగను నిర్వహించుకుంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గడ్డం శ్రీనివాస్ యాదవ్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News