Sunday, February 22, 2026
Homeస్పోర్ట్స్Sabalenka | ఆట కన్నా.. ఆరోగ్యం మిన్న..

Sabalenka | ఆట కన్నా.. ఆరోగ్యం మిన్న..

వరల్డ్ నంబర్ వన్(World Number One) ఉమెన్ టెన్నిస్ ప్లేయర్(Woman Tennis Player) అరినా సబలెంకా ఈ ఏడాది ఆట(Game) కన్నా ఆరోగ్యం (Health) పైనే దృష్టి(Focus) పెట్టనున్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఆమె చాలా ఈవెంట్లను స్కిప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో గనక రెస్ట్ తీసుకోకపోతే హెల్త్ పరంగా రిస్క్ ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆట ఆడకపోవటం వల్ల తనపై జరిమానా విధించే ఛాన్స్ ఉందని తెలిసినా సబలెంక్ లెక్క చేయనంటోంది. చాలా మంది క్రీడాకారులు గాయాల బారిన పడుతున్నారని పేర్కొంది. డబ్ల్యూటీఏ రూల్స్(Wta Rules) ప్రకారం టాప్ ప్లేయర్లు 4 గ్రాండ్ శ్లామ్స్, 10 డబ్ల్యూటీఏ 1000 టోర్నమెంట్లు, 6 డబ్ల్యూటీఏ 500 ఈవెంట్లు తప్పకుండా ఆడాలి. ఈ నిబంధనలను పాటించకపోతే ర్యాంకింగ్ పాయింట్ల తగ్గింపుతోపాటు ఫైన్ కూడా కట్టాలి. 2025లో ఈమె 3 డబ్ల్యూటీఏ 500 ఈవెంట్లు మాత్రమే ఆడింది. ‘ఈవెంట్లలో తప్పనిసరిగా పాల్గొనాలని రూల్స్ చెబుతున్నాయి. కానీ నా శరీరాన్ని రక్షించుకోవడానికి నేను ఇప్పటికే రెండు ఈవెంట్ల నుంచి తప్పించుకున్నాను. ఎందుకంటే గత సీజన్‌లో నేను చాలా కష్టపడ్డాను” అని సబలెంకా తెలిపింది. కొన్ని టోర్నీల్లో అనారోగ్యంతోనే ఆడాల్సి వచ్చిందని వాపోయింది. అతిగా ఆడటం వల్ల అలసిపోయానని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News