ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మళ్లాలని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి పిలుపునిచ్చారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా కుకునూరు పల్లి రైతు వేదికలో ముద్దాపూర్ గ్రామానికి చెందిన రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రకృతి వ్యవసాయం పద్ధతులు, రసాయనాల వినియోగం తగ్గింపు, ఖర్చు తగ్గిస్తూ అధిక దిగుబడులు సాధించే మార్గాలను వివరించారు. నేల సారాన్ని కాపాడుతూ, ఆరోగ్యకరమైన పంటల ఉత్పత్తికి ప్రకృతి వ్యవసాయం ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

అనంతరం రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లను పంపిణీ చేశారు. రైతులు ఈ పద్ధతులను అమలు చేసి, సుస్థిర వ్యవసాయం వైపు అడుగులు వేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గజ్వేల్ సహాయ వ్యవసాయ సంచాలకులు బాబు నాయక్, వ్యవసాయ అధికారి గోవింద రాజు, ముద్దాపూర్ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీహరి, ఆత్మ బ్లాక్ లెవెల్ అధికారి ఆశ్లేషతో పాటు రైతులు పాల్గొన్నారు.
