Tuesday, February 10, 2026
HomeతెలంగాణRevenue | రెవెన్యూ పెంచేందుకు మార్గదర్శకాలు..

Revenue | రెవెన్యూ పెంచేందుకు మార్గదర్శకాలు..

  • ఆర్టీసీ ఆదాయ మార్గంలో పయనించేలా చేయండి
  • కొత్త కాలనీలకు బస్ సౌకర్యాలు కల్పించాలి
  • అధికారులతో సమీక్షలో మంత్రి పొన్నం ఆదేశం

ఆర్టీసీ రెవెన్యూ పెంచేందుకు మార్గాలు అన్వేషించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త కాలనీలకు బస్సు రూట్లు పెంచేలా అధ్యయనం చేయాలన్నారు. కారుణ్య నియామకాల కింద ఎంపికైన కండక్టర్ల ప్రొవిజన్ పీరియడ్ రెండేళ్లకు తగ్గించాలని చెప్పారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ డిపోలు లాభాల్లోకి వచ్చేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆరంఘర్లో బస్సు టెర్మినల్ కోసం పోలీసు శాఖ భూములపై చర్చించాలన్నారు. హైదరాబాద్లో కొత్త డిపోలకు స్థల పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బస్సు ప్రమాదాలను తగ్గించడానికి డ్రైవర్ మానిటరింగ్ సిస్టం అమలు చేస్తామని వివరించారు. త్వరలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తామని తెలిపారు.

మహాలక్ష్మీ పథకం వచ్చిన తర్వాత సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ క్రమక్రమంగా లాభాల బాటలోకి వస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి నెల వారిగా వస్తున్న మహాలక్ష్మి టికెట్ ఆదాయమే కాకుండా అదనపు ఆదాయంపై దృష్టి సాధించాలని సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ సిబ్బందికి సూచించారు. తాజాగా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్టీసీ లో ఇప్పటి వరకు మహిళలాలు 237 కోట్ల జీరో టికెట్ ఉపయోగించుకున్నారని తెలిపారు. 7980 కోట్ల రూపాయలు ఆర్టీసీ కి ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించారు. టికెట్ ఆదాయంతో పాటు టికెట్ యేతర ఆదాయంపై దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులకు దిశా నిర్దేశర చేశారు. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్ లలో / టీమ్ మిషన్ ల ద్వారా వచ్చే టికెట్ పై అడ్వటేజ్మెంట్స్ ద్వారా ఆదాయాన్ని మరింత పెంచాలని సూచించారు.

- Advertisement -

ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్న తాండూరు, వికారాబాద్, బీహెచ్ఈఎల్, మియాపూర్, కుషాయిగూడ, దిల్సుఖ్నగర్, హకీంపేట్, రాణిగంజ్, మిథానితో పలు డిపోలు నష్టాల బారిన పడటానికి కారణాలు, స్థానిక పరిస్థితులు ఆయా డిపోలు లాభాల బాట పట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీ వేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి నీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ఇప్పటికే 500 వరకు ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. పీఎం ఈ -డ్రైవ్ కింద హైదరాబాద్ కి కేటాయించిన 2 వేల బస్సులు విడతల వారిగా రానుండడంతో అందుకు సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News