అభినందన సభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ(Yusufguda)లో సినీ కార్మిక సంఘాల (Film trade unions) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అభినందన సభ (Congratulatory) కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కృష్ణా నగర్(Krishna Nagar)లో ఒక మంచి స్థలాన్ని చూసి నర్సరీ నుంచి 12వ తరగతి వరకు కార్పొరేట్ స్థాయిలో స్కూల్ (Corporate School) నిర్మించి సినీ కార్మికుల పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ఆరోగ్య సమస్యలకు ఆరోగ్యశ్రీ (Aarogyashree) ద్వారా ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం నిధి ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ నిధికి రూ.10 కోట్లు అందిస్తామని వెల్లడించారు.

భవిష్యత్‌లో ఎంత పెద్దవారైనా అదనంగా టికెట్ల ధరలు (Ticket Rates) పెంచాలనుకుంటే అందులో 20 శాతం కార్మికుల వెల్ఫేర్ ఫండ్(Welfare Fund)కు అందిస్తేనే అనుమతి ఇచ్చేలా నిబంధనలు సడలిస్తామని పేర్కొన్నారు. రాత్రీ పగలు తేడా లేకుండా పనిచేస్తున్న కార్మికుల శ్రమ, కష్టం తనకు తెలుసని, గతంలో నిలిపివేసిన నంది అవార్డుల స్థానంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ అవార్డుల(Gaddar Awards)ను అందిస్తున్నామని గుర్తుచేశారు. తెలుగు సినిమాను ఆస్కార్ (Oscar) స్థాయికి తీసుకెళ్లడం వెనక సినీ కార్మికుల కష్టం ఉందని, హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు వేదిక కావాలన్నదే తమ కోరిక అని చెప్పారు. తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికలో ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రత్యేక చాప్టర్ ఉంటుందని సీఎం రేవంత్ అన్నారు.

