- రిపోర్టర్…
అతను కేవలం వార్తలు రాయడు… సమాజం నడిచే నిజాలను మోస్తాడు… వర్షం పడినా… ఎండ మండినా… ఘటన చోటుకి ముందే చేరేది అతడే… ఇతరులు చూసే ముందు నిజం చూస్తాడు… కాని తన బాధను మాత్రం ఎవరికీ చూపించడు…మరికొన్ని క్షణాలు… జీవితం – మరణం మధ్య నిలబడి రిపోర్ట్ చేస్తాడు… అది అతని డ్యూటీ కాదు… అతని బాధ్యత… రాత్రి, పగలు తేడా లేకుండా… ఫోన్ మోగితే వెంటనే బయల్దేరే జీవితం అతనిది…కుటుంబంతో గడిపే సమయం తగ్గినా…సమాజం కోసం గడిపే సమయం ఎక్కువ…
- రిపోర్టర్…
ప్రశ్నలు అడుగుతాడు… కానీ తన జీవితానికి సమాధానాలు వెతకడానికి టైమ్ ఉండదు… అతను రాసిన వార్తతో ఎంతో మందికి న్యాయం జరుగుతుంది… కాని అతని కష్టానికి గుర్తింపు మాత్రం అరుదే… అతడే నిజానికి కళ్లూ… అతడే సమాజం గొంతు… కానీ…ఆ గొంతుకి పేరు ఉండదు…
- చిట్టిమళ్ళ మహేందర్
- Advertisement -
