Sunday, October 26, 2025
ePaper
Homeస్పోర్ట్స్Rohit Sharma | రోహిత్ సెంచరీ.. ఇండియా విక్టరీ..

Rohit Sharma | రోహిత్ సెంచరీ.. ఇండియా విక్టరీ..

ఆస్ట్రేలియా (Australia) పర్యటనలో పరాజయాలకు టీమిండియా (Team India) చెక్ పెట్టింది. మూడు వన్డేల సిరీస్‌ను విజయంతో ముగించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్‌ను కోల్పోయిన ఇండియా చివరి మ్యాచ్‌లో సమష్టిగా రాణించి 9 వికెట్ల తేడాతో ఓదార్పు విజయాన్నందుకుంది. రోహిత్ శర్మ(125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 121 నాటౌట్) (Rohit Sharma) అజేయ సెంచరీతో చెలరేగగా విరాట్ కోహ్లీ(81 బంతుల్లో 7 ఫోర్లతో 74 నాటౌట్) (Virat Kohli) అజేయ అర్ధ శతకంతో రాణించాడు.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్ రేన్‌షా(58 బంతుల్లో 2 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా మిచెల్ మార్ష్(41), మాథ్యూ షార్ట్(30) విలువైన ఇన్నింగ్స్ ఆడారు. మన బౌలర్లలో హర్షిత్ రాణా(4/39) నాలుగు వికెట్లు తీశాడు. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తమ ఖాతాల వేసుకున్నారు. వాషింగ్టన్ సుందర్(2/44) రెండు వికెట్లు పడగొట్టాడు.

ఇండియా 38.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 232 పరుగులు చేసి, 69 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (Player Of The Match) అవార్డ్ లభించింది. బుధవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20(T20)ల సిరీస్ ప్రారంభం కానుంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News