రోహిత్‌శర్మ(Rohit Sharma) సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియా (Australia) పై ఆ దేశంలోనే వన్డే మ్యాచ్‌ల్లో వెయ్యి పరుగులు చేసిన తొలి ఇండియన్ బ్యాటర్(First Indian Batter)గా నిలిచాడు. మొత్తం 21 మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ 1071 రన్నులు నమోదు చేశాడు. యావరేజ్ 56.36 కాగా స్ట్రైక్ రేట్ 89.32. ఇందులో నాలుగు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోర్ 171 నాటౌట్.
ఈ రోజు ఆడిలైడ్(Adelaide)లోని ఓవల్ మైదానం (Oval Grounds) జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ శర్మ 97 బంతుల్లో 73 పరుగులు చేశాడు. ఈ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ప్రస్తుతం విరాట్ కోహ్లీ(Virat Kohli)కి మాత్రమే ఉంది. ఎందుకంటే అతను ఇప్పటికే 802 రన్నులు చేశాడు. కానీ.. కోహ్లీ వన్డేల నుంచి కూడీ రిటైర్ అవుతారనే వార్తలు వస్తున్నాయి.
