- సి ఐ మాదాసు శంకర్
రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాల పై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలి అన్నారు యాదగిరి గుట్ట సి ఐ మాదాసు శంకర్.ఆదర్శ పాఠశాల, కళాశాల విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై ఎస్ ఐ తేజం రెడ్డి తో కలిసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సి ఐ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలపై ప్రతి రోజూ ,దేశ వ్యాప్తంగా 485 మరణాలు జరుగుతున్నాయన్నారు.18 సంవత్సరాల నిండి, డ్రైవింగ్ లైసెన్స్ఉండి డ్రైవింగ్ సమయంలో తప్పకుండా హెల్మెట్ ధరించాలి అన్నారు. రోడ్డు కు ఎడమ వైపు వెళ్లాలన్నారు. వేగం ముఖ్యం కాదు క్షేమంగా గమ్యం చేరడం ముఖ్యం అన్నారు.
త్రీపుల్ రైడింగ్ చెయ్యకూడదన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ దొరికితే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. స్మార్ట్ ఫోన్లలో పంపే లింక్ లను ఓపెన్ చేస్తే సైబర్ నేరగాళ్లు మీ ఖాతా లో ఉన్న డబ్బులు మీకు తెలియకుండానే నొక్కేస్తారు, అపరిచితులకు ఓ టి పి చెప్పొద్దన్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ కుంట రమేష్ కుమార్,ఉపాధ్యాయులు పి జి టీ డా.కంబాల రమేష్, పృథ్వీరాజ్, రాజేందర్, పి ఈ టీ మహేష్ , పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
