- రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్టు మండలం
బండరావిరాల గ్రామ ప్రజలు గుంతల రోడ్ల కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ మార్గదర్శకంలో, వార్డు సభ్యులు కందికంటి అనూష ప్రవీణ్ పర్యవేక్షణలో శుక్రవారం రోజు రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. గత కొన్ని నెలలుగా గుంతలమయంగా మారి ప్రమాదాలకు నిలయంగా ఉన్న రోడ్లకు, ప్యాచ్ వర్క్ పూర్తి చేయడంతో వాహనదారులు, గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మరమ్మతులతో రోడ్ల పరిస్థితి మెరుగుపడి, రాకపోకలు సులభంగా సాగుతాయని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ పనులకు సహకరించిన పరి & సప్తగిరి డాంబర్ ప్లాంట్ యజమానులకు, లారీ యజమానులు కుర్రి జంగయ్య, మొలుగు దానెష్ కి, గ్రామ పంచాయతీ సిబ్బందికి గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దూస శంకర్, వార్డు సభ్యులు కన్నె భరత్, ఎడవల్లి సుష్మిత రమేష్, ఏర్పుల హరికృష్ణ, గుండ్ల భవాని శివ ముదిరాజ్, గుండ్ల సతీష్ యాదవ్, యువజన నాయకులు గుండ్ల జగదీష్ యాదవ్, నరేష్, మధు, శివ కుమార్, శివ శంకర్, ఉపేందర్, మహేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

