Tuesday, October 28, 2025
ePaper
Homeబిజినెస్రూ.14 వేల కోట్లతో RGIA విస్తరణ

రూ.14 వేల కోట్లతో RGIA విస్తరణ

శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (RGIAని) విస్తరించాలని ఎయిర్‌పోర్టు నిర్వహణ సంస్థ యోచిస్తోంది. RGIA నిర్వహణను జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ చూస్తోంది. విస్తరణ కోసం మూడేళ్లలో రూ.14 వేల కోట్లను ఖర్చుచేయనుంది. ఈ మేరకు ఒక ఇంటర్నల్ డాక్యుమెంట్‌లో తెలిపింది. ప్రస్తుతం ఉన్న టెర్మినల్‌ను విస్తరించడంతోపాటు మరో టెర్మినల్‌, రన్‌వేను డెవలప్ చేయనున్నారు.

2026-27లో ఈ పనులను ప్రారంభించి 2029 సెప్టెంబర్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్జీఐఏను ఏటా 3.4 కోట్ల మంది ప్రయాణికుల కోసం, గంటకు 42 ఫ్లయిట్ల రాకపోకల కోసం నిర్మించారు. 2017-18లో 1.83 కోట్లుగా ఉన్న ప్రయాణికుల సంఖ్య ఏటా 7.1 శాతం వృద్ధి రేటుతో గత ఆర్థిక సంవత్సరంలో 2.95 కోట్లకు పెరిగింది. విమానాల సంఖ్య గంటకు 36కు చేరింది. దీంతో ఎయిర్‌పోర్టు త్వరలోనే మ్యాగ్జిమమ్ కెపాసిటీకి చేరువవుతోంది. ఈ నేపథ్యంలో విస్తరణ అవసరం ఏర్పడింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News