Wednesday, February 11, 2026
Homeఆంధ్రప్రదేశ్Review | ఎకనమిక్ రీజియన్‌పై సమీక్ష

Review | ఎకనమిక్ రీజియన్‌పై సమీక్ష

అమరావతి-విశాఖ (Amaravathi-Vishaka) ఎకనామిక్ రీజియన్ (Economic Region) అభివృద్ధిపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో సీఎస్ కె.విజయానంద్, ఆర్ధిక, పర్యాటక, పారిశ్రామిక, రవాణా, ఐటీ, మునిసిపల్, వ్యవసాయ, ప్రణాళికా విభాగం ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్‌ను రాష్ట్రానికి గ్రోత్ హబ్‌(Growth Hub)గా తీర్చిదిద్దే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. శ్రీకాకుళం (Srikakulam) నుంచి కోనసీమ (Konaseema) వరకు వివిధ జిల్లాలను విశాఖ ఎకనామిక్ రీజియన్‌గా అభివృద్ధి చేసే అంశంపై సమీక్షించారు. ఈ ప్రాంతంలో వేర్వేరు జిల్లాల్లో ఆర్ధిక వ్యవస్థ, పెట్టుబడులు, జీవన ప్రమాణాలు, సుస్ధిరాభివృద్ధి తదితర అంశాలతో ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై సమావేశంలో చర్చించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News