Friday, September 12, 2025
ePaper
spot_img
Homeతెలంగాణఅమీన్‌పూర్‌లో రంగంలోకి బుల్డోజర్లు

అమీన్‌పూర్‌లో రంగంలోకి బుల్డోజర్లు

  • ఆక్రమణలను తొలగిస్తున్న రెవెన్యూ అధికారులు

హైడ్రా మరోసారి పంజా విసిరింది. అమీన్‌ పూర్‌లో హైడ్రా బుల్డోజర్లు రంగంలోకి దిగి అక్రమ నిర్మాణాలను కూల్చివేశాయి. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా అక్రమ నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందిన వెంటనే హైడ్రా స్పందిస్తూ… వాటిని కూల్చివేసే పనిలో పడుతోంది. ఆక్రమణదారుల వెన్నులో వణుకుపుట్టేలా చేస్తోంది హైడ్రా. తాజాగా అమీన్‌ పూర్‌లో మరోసారి కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. అమీన్‌ పూర్‌ పద్మావతి లేఅవుట్‌లో అక్రమంగా వేసిన ఫెన్సింగ్‌ను మంగళవారం ఉదయం హైడ్రా అధికారులు తొలగించేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌ పూర్‌ పెద్ద చెరువు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను హైడ్రా కూల్చివేసింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డికి చెందిన ప్రహారీ గోడను గతంలో అధికారులు కూల్చివేశారు. అయితే తిరిగి మరోసారి అక్కడ ఫెన్సింగ్‌ను నిర్మించారు. దీనిపై ఐలాపూర్‌ రాజగోపాల్‌ నగర్‌, బందంకొమ్ము ప్రాంతాల్లో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు మరోసారి ఫెన్సింగ్‌ను కూల్చివేశారు. అమీన్‌ పూర్‌ చెరువు కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. అక్రమాలపై వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా అధికారులు విచారణ చేపట్టారు. ఆక్రమణ జరిగినట్లు తేలడంతో కూల్చివేతకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News