Thursday, February 12, 2026
HomeతెలంగాణCongress | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతం

Congress | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతం

  • పంచాయితీ ఫలితాలు మా పాలనకు గీటురాయి
  • రెండేళ్ల మా పాలన పట్ల ప్రజల్లో సానుకూలత
  • ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలపై త్వరలో నిర్ణయం
  • అందరితో చర్చించి ఓ నిర్ణయానికి వస్తాం
  • ఎన్నికలు సజావుగా నిర్వహించిన అధికారులకు కృతజ్ఞతలు
  • బీఆర్‌ఎస్‌, బీజేపీ కూటమికి 33శాతం మాత్రమే సీట్లు దక్కాయి
  • ఇప్పటికైనా బిఆర్‌ఎస్‌ బుద్దిగా మసలుకోవాలి
  • నదీ జలాలపై మాట్లాడేందుకు దమ్ముంటే కేసీఆర్‌ చర్చకు రావాలి
  • మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్‌

మూడు దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అద్భుతమైన ఫలితాలను సాధించిందని.. 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృత మవుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మా రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ ఫలితాలని ఆయన అభివర్ణించారు. కంటోన్మెంట్‌, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ఆశీర్వదించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పార్టీ విజయం కోసం కష్టపడిన కాంగ్రెస్‌ కార్యకర్తలందరి కీ ధన్యవాదాలు తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిచ దామోదర్‌ రాజనర్సింహలతో కలిసి సీఎం మాట్లాడారు. మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అద్భుత ఫలితాలు సాధించిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపునకు కష్టపడిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలియజేశారు. 12,702 పంచాయతీలకు గాను 7,527 పంచాయతీల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచిందన్నారు. 808 కాంగ్రెస్‌ రెబల్స్‌ నెగ్గారని వివరించారు. 66 శాతం ఫలితాలను కాంగ్రెస్‌ సాధించిందని తెలిపారు. 3,511 కాంగ్రెస్‌ , 710 బీజేపీ మొత్తంగా 33 శాతం గెలిచాయని పేర్కొన్నారు. 94 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరిగాయని.. 87 నియోజక వర్గాల పరిధిలో కాంగ్రెస్‌ మెజారిటీ సాధించిందని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయన్నారు.

- Advertisement -

తమ ప్రభుత్వంపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం కనబరిచారని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ కూటమిగా పోటీ చేశాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ కూటమికి 33శాతం విజయాలు మాత్రమే దక్కాయన్నారు. బీఆర్‌ఎస్‌కు 3,511 సర్పంచ్‌ స్థానాలు, బీజేపీ 710 చోట్ల గెలిచాయని చెప్పారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ కూటమికి 4,221 స్థానాలు మాత్రమే దక్కాయని సీఎం రేవంత్‌ తెలిపారు. ఇటీవల ప్రజాపాలన రెండేళ్ల సంబురాలు నిర్వహించుకున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 12వేలకు పైగా గ్రామపంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్య బద్దంగా జరిగాయి. ఎన్నికలు సజావుగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. దాదాపు 146 గ్రామ పంచాయతీలు (ఒక శాతం) సీపీఐ, సీపీఎం, ఇతరులు గెల్చుకున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించారు.

పంచాయతీ ఎన్నికల ఫలితాలు మా రెండేళ్ల పాలనపై తీర్పుగా భావిస్తున్నాం అని సిఎం అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే పెద్దల సూచనను పాటిస్తాం. కానీ, ప్రతిపక్షంలో ఉన్న వారికి ఇంకా అహంకారం తగ్గలేదు. ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించాలని రేవంత్‌ రెడ్డి అన్నారు. పేదలకు మేం అందిస్తున్న సంక్షేమ పథకాలే మా విజయానికి కారణం. ఈ ఫలితాలను చూసి భారత రాష్ట్ర సమతి నేతలు అద్భుతం అంటున్నారు. సంతోషం.. విూరు కోరుకున్నట్టే ఈ అద్భుతం 2029లో కూడా జరుగుతుంది. 2/3 మెజార్టీతో 2029లో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వస్తుంది. 1/3తో భారత రాష్ట్ర సమితి ఉంటే.. 2/3 మెజార్టీతో కాంగ్రెస్‌ ఉంటుంది. ఈ తీర్పు 2029లో కూడా పునరావృతం కాబోతోందని సీఎం అన్నారు.బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను సాధించడంపై శాసనసభ సమావేశాల్లో చర్చించి అన్ని పార్టీల అభిప్రాయం మేరకు ఎంపీటీసీ, జేడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలపై నిర్ణయానికి వస్తామని చెప్పారు.

ప్రజల ఆశీర్వాదంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండిరడినీ సమపాళ్లలో ముందుకు తీసుకెళుతున్నామని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా రేషన్‌ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నధాన్యానికి బోనస్‌ చెల్లింపు, ఉచిత కరెంట్‌, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌, రూ. 500 లకే సిలిండర్‌, 27 వేల కోట్ల రూపాయల మేరకు సున్నా వడ్డీకే మహిళా సమాఖ్యలకు రుణాలు, 4.5 లక్షల మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 61 వేల ఉద్యోగాల భర్తీ, సుదీర్ఘకాలం అపరిష్కృతంగా ఉన్న ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం, వందేళ్లుగా జరగని బీసీ కులగణన చేపట్టడం, పేదలకు మంచి విద్యను అందించాలన్న ప్రయత్నాలు…

ఇలా అనేక అంశాల్లో ప్రభుత్వం ఒక క్రమపద్ధతిలో అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి వివరించారు. ఒకవైపు ఆదాయాన్ని పెంచుకుంటూ దుబారాను తగ్గిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం జరక్కుండా ప్రజలకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ తాపత్రయమని ఒక ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కృష్ణా, గోదావరి జలాలపై తెలంగాణ హక్కులకు సంబంధించి పూర్తి వివరాలతో శాసనసభలో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News