–ఆదాబ్ హైదరాబాద్ పేపర్‌లో వచ్చిన “టెండర్ల బిజీలో ఆబ్కారి…
-“లంచాల మత్తులో మున్సిపల్” కథనానికి స్పందించిన బోడుప్పల్ కమిషనర్
చెంగిచెర్ల ప్రధాన రహదారి యూనివర్సల్ బేకరీ ఎదురుగా నిర్మిస్తున్న అనుమతులు లేని రాజస్థానీ మార్బుల్ షెడ్డు కూల్చివేత
-ఇటు రాజస్థానీ మార్బుల్ షెడ్డు కూల్చివేతలు..
అటు రెండవ డివిజన్లో భారీ షెడ్డు నిర్మాణం అయినవారికి ఒకటి, కానీ వారికి మరొకటి అనే చందంగా భారీ షెడ్డును వదిలేసిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది
మేడిపల్లి: మేడ్చల్ జిల్లా బోడుప్పల్ (Boduppal) మున్సిపల్ కార్పొరేషన్ లో నిత్యం ఆక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉంటాయి. ఈ తరంగం బోడుప్పల్ మున్సిపల్ మామూలు అయిపోయింది. చెంగిచెర్ల ప్రధాన రహదారి యూనివర్సల్ బేకరీ ఎదురుగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న రాజస్థానీ మార్బుల్ (Rajasthan Marbles) షెడ్డు గురించి ఆదాబ్ హైదరాబాద్ లో వచ్చిన కథనానికి స్పందించిన మున్సిపల్ కమిషనర్ (Municipal Commissioner) కూల్చివేశారు. మున్సిపల్ పరిధి రెండో డివిజన్ లో నిర్మిస్తున్న భారీ షెడ్డు విషయంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ (Town Planning) సిబ్బంది చర్యలు తీసుకోకపోకపోవడంలో అంతర్యం ఏమిటని ప్రజలు బాహటంగా చర్చించుకుంటున్నారు. కార్పొరేషన్ లో అక్రమ నిర్మాణాలు తమ దృష్టికి వచ్చినట్టయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శైలజ చెప్పారు.
