- ఫిట్నెస్ సర్టిఫికేట్లు వ్యాలిడ్లోనే ఉన్నాయి..
- కర్నూలు బస్సు ప్రమాదంపై నీ కావేరీ యాజమాన్యం స్పందన
కర్నూలులో జరిగిన దారుణ బస్సు ప్రమాదంపై వీ కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ఎట్టకేలకు స్పందించింది. సంస్థ యజమాని వేమూరి వెంకటేశ్వర్లు పేరుతో విడుదల చేసిన ప్రకటనలో, ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమ బస్సుకు అన్ని ఫిట్నెస్ సర్టిఫికేట్లు చెల్లుబాటులోనే ఉన్నాయని, అవసరమైన అన్ని అనుమతులు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. అలాగే ప్రయాణికులందరికీ సంస్థ తరఫున ఇన్సూరెన్స్ కూడా ఉన్నదని పేర్కొన్నారు. అంతేగాక, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు సంస్థ పూర్తిగా సహకరిస్తుందని, విచారణలో అధికారులతో పూర్తిగా భాగస్వామ్యం చేస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది.
