- సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా
శ్రీభక్త మార్కండేయ పద్మశాలి సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ దమ్మాయిగుడ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం సంఘం భవనం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షుడు రావిరాల సుదర్శన్, ప్రధాన కార్యదర్శి సీత మార్కండేయల నాయకత్వం వహించారు. ముందుగా జాతీయ జెండాను అధ్యక్షుడు రావిరాల సుదర్శన్ ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది.
ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా జరిగింది. ఉపాధ్యక్షులుగా మంత్రి గోవర్ధన్, గుజ్జ శ్రీనివాస్, ఏలె పాండురంగ, పున్నం పద్మనాభం బాధ్యతలు స్వీకరించారు. జాయింట్ సెక్రటరీలుగా మంతూరి శ్రీనివాస్, భూర ఆనందం నియమితులయ్యారు. కార్యనిర్వహణ కార్యదర్శులుగా డాక్టర్ పిట్టల వెంకటేశ్, దోర్నాల వివేకనంద, సీత శశిధర్, రావిరాల లక్ష్మినారయణ బాధ్యతలు చేపట్టారు.

సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా బల్ల భూమయ్య కొనసాగుతుండగా, సలహదారులుగా మేక సుధాకర్, శ్రీరాంజనార్ధన్, సామల సురేష్, రుద్ర శ్రీహరి, తడుక కృష్ణ, బండ లింగమ్మ నియమితులయ్యారు. కార్యవర్గ సభ్యులుగా సకినాల పాండు, ఆర్శనపల్లి శ్రీనివాస్, గంజి పాండు, కారంపుడి చంద్రశేఖర్, సిద్దుల వెంకటేష్, జోగు సంధ్య, మావిడాల శైలజలు ఎన్నికయ్యారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ పద్మశాలి సంఘం అభివృద్ధికి సమిష్టి కృషి అవసరమని, సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
