- ప్రకాష్ ప్రజాపతి ఆధ్వర్యంలో సంబురాలు..
- వేడుకల్లో పాల్గొన్న పలువురు నాయకులు, విద్యార్థులు, గ్రామస్తులు..
రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, లోయపల్లి గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.. ఈ సందర్బంగా భారతీయ జనతా పార్టీ 76 వ బూత్ అధ్యక్షులు ప్రకాష్ ప్రజాపతి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.. ఆయన జెండా ఎగురవేసి మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణ త్యాగం చేయడానికి అయినా వెనుకాడకుండా.. పోరాడి వీర మరణం పొందిన వీరులను తలుచుకోవాలని విద్యార్థులు తెలుసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమం లో 8 వ వార్డు ఉపసర్పంచ్ బొడ్డుపల్లి నాగరాజు, 10వ వార్డు బైరు సంధ్య యాదయ్య, 12వ వార్డు బిచ్చిసేవ్య నాయక్, 4వ వార్డు దివ్యశ్రీ వెంకటచారి, సర్పంచ్ కాంటెస్టెడ్ మేఘవత్ రమేష్ నాయక్, బూత్ అధ్యక్షులు చెరుకు శివ, బండి వెంకటేష్, శక్తి కేంద్ర ఇంచార్జ్ కలిగొని శేఖర్, మాజీ పదాధికారుల సీనియర్ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
