కేంద్ర ప్రభుత్వ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) పరిధిలోని సీసీఎంబీ (CCMB), ఎన్‌జీఆర్‌ఐ(NGRI)ల్లో ఉద్యోగాలకు ప్రకటనలు విడుదలయ్యాయి. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో 13 సైంటిస్ట్ (Scientist) పోస్టులు ఉండగా.. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 12 మల్టీటాస్కింగ్(Multi Tasking) పోస్టులు, 1 సెక్యూరిటీ ఆఫీసర్ (Security Officer) పోస్టు ఉన్నాయి. సీసీఎంబీలోని ఉద్యోగాలకు ఈ నెల 30లోపు అప్లై చేయాలి. ఎంపికైనవారికి లక్షా 38 వేల రూపాయలకు పైగా వేతనం ఇస్తారు. వివరాల కోసం www.ccmb.res.inను సందర్శించాలి. ఎన్‌జీఆర్‌ఐలో ఉద్యోగాలకు 2026 జనవరి 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయినవారికి రూ.36 వేలు వేతనం ఇస్తారు. వివరాలకు www.ngri.res.inను సంప్రదించొచ్చు.
CSIR | సీసీఎంబీ, ఎన్‌జీఆర్ఐల్లో 26 ఉద్యోగాలు
- Advertisement -
RELATED ARTICLES
