Friday, October 3, 2025
ePaper
Homeజాతీయంరికార్డు స్థాయిలో రూ.440 కోట్ల ఆదాయం

రికార్డు స్థాయిలో రూ.440 కోట్ల ఆదాయం

శ‌బ‌రిమ‌ల ఆల‌య ఆదాయ వివ‌రాలు వెల్ల‌డించిన ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు

అశేష సంఖ్యలో భక్తులు సందర్శించే క్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భారీగా ఆదాయం లభించింది. మాలదీక్షల సమయంలో లక్షలాదిగా భక్తులు తరలిరాగా ప్రస్తుతం మాలదీక్ష సమయం ముగిసింది. నెల వ్యవధిలో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. రద్దీ సమయంలో ఆలయ హుండీ కాసులతో కళకళలాడింది. దీంతో హుండీని లెక్కించగా రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. శబరిమల తీర్థయాత్ర సీజన్ ఆదాయం 2024-25 మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్‌లో ఆలయానికి భారీగా భక్తులు సందర్శించిన విషయ తెలిసిందే. ఈ సందర్భంగా ఆలయ హుండీ ఆదాయాన్ని లెక్కించారు. హుండీతోపాటు తీర్థ ప్రసాదాలు, ఇతర సేవలకు సంబంధించిన ఆదాయం గణించారు. శబరిమల ఆలయం రికార్డు స్థాయిలో రూ.440 కోట్లు ఆర్జించిందని ట్రావెన్ కోర్ దేవస్వం మంత్రి వీఎన్ వాసవన్, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు చైర్మన్ పీఎస్ ప్రశాంత్ ప్రకటిచారు. ఆలయ హుండీ ఆదాయం విషయమై మీడియాకు వివరాలు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News