Friday, February 27, 2026
Homeసాహిత్యంPromise | అసలు సిసలు వాగ్ధానాలంటే ఇవే కదా

Promise | అసలు సిసలు వాగ్ధానాలంటే ఇవే కదా

రాలుతున్న ప్రతి గింజ(Seed) చెట్టు(Tree)కు వాగ్ధానం చేస్తుంది.. విత్తనమై మొలకెత్తుతానని. రగులుతున్న ప్రతి సమస్య(Problem) బాధితులకు వాగ్ధానం చేస్తుంది.. భరోసా(Reassurance) కల్పిస్తానని. తెగిపడిన ప్రతి నక్షత్రం(Star) ఆకాశానికి(sky) వాగ్ధానం చేస్తుంది.. ఆరిపోనీ వెలుగై ప్రకాశిస్తానని. కూలుతున్న ప్రతి చెట్టు భూమికి వాగ్ధానం చేస్తుంది.. నేలను సారవంతం చేస్తానని. పచ్చని ప్రతి పంట చేను రైతుకు వాగ్ధానం చేస్తుంది.. ప్రజలందరి ఆకలి తీరుస్తానని. పాలపిట్ట పంట చేనుకు వాగ్ధానం చేస్తుంది.. చీడ పురుగులను సంహరించి రైతు నేస్తమవుతానని. గాలి ప్రతి ప్రాణికి వాగ్ధానం చేస్తుంది.. ప్రతి శ్వాసలో ఊపిరై ఉంటానని. నీరు నేలకు వాగ్ధానం చేస్తుంది.. మట్టి పొత్తిళ్లలో విత్తుకు ప్రాణం పోస్తానని. జీవ కారకాలు (పంచ భూతాలు) సకల జీవరాశులకు వాగ్ధానం చేస్తున్నాయి.. విధ్వంస విధానాలను ధ్వంసం చేస్తామని. ఆశయం ఆయుధానికి వాగ్ధానం చేస్తుంది.. ఆధిపత్యాన్ని అంతం చేస్తానని. నిన్నటి రోజు ఈరోజుకు వాగ్ధానం చేస్తుంది.. రేపటి రోజునై తప్పక వస్తానని. విప్లవం అశేష ప్రజలకు వాగ్ధానం చేస్తుంది.. అమరుల కల సాకారం చేస్తానని.

  • విశ్వ జంపాల
- Advertisement -
RELATED ARTICLES

Latest News