Friday, October 3, 2025
ePaper
Homeస్పోర్ట్స్RCB | కీలక ఆటగాళ్లను వదులుకోనున్న ఆర్సీబీ

RCB | కీలక ఆటగాళ్లను వదులుకోనున్న ఆర్సీబీ

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 19వ ఎడిషన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఘనంగా ఆరంభించాలని చూస్తోంది. రజత్‌ పాటిదార్‌ నాయకత్వంలో జట్టు గత ఎడిషన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ను ఫైనల్‌లో ఓడించి తొలి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టైటిల్‌ను గెలుచుకుంది. ఇదే ఉత్సాహం వచ్చే సీజన్‌ స్టార్ట్‌ చేయాలని ప్లాన్‌ చేస్తోంది. అందుకే జట్టులో మార్పులు చేర్పులకు డిసెంబర్‌లో జరిగే వేలంలో పాల్గొనేందుకు కసరత్తు షురూ చేసింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2026 కోసం డిసెంబ్‌లో మినీ వేలం నిర్వహిస్తారు. ఇందులో ఆటగాళ్లను కొనుగోలు చేసి జట్లలో కొన్ని మార్పులు చేయాలని అన్ని టీంలు చూస్తాయి. వేలంలో పాల్గొనేందుకు వీలుగా ముందు జట్లు కొంతమంది ఆటగాళ్లను రిలీజ్‌ చేస్తాయి. అలాంటి పనే ఆర్సీబీ కూడా చేయబోతోంది. ఆర్సీబీ నలుగురు ఆటగాళ్లను విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఇంగ్లాండ్‌ ఆల్‌ రౌండర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ను ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌2025 కంటే ముందు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 8.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అతను 2022 నుంచి 2024 వరకు పంజాబ్‌ కింగ్స్‌ తరపున 11.50 కోట్లకు ఆడాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2025లో అతని ప్రదర్శన తీవ్ర నిరాశపరిచింది, చనాలను అందుకోలేకపోయింది. అతను 8 ఇన్నింగ్స్‌లలో 112 పరుగులు చేశాడు. తన బౌలింగ్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. కేవలం 2 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అందుకే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2026 వేలానికి ముందు లివింగ్‌స్టోన్‌ను విడుదల చేయాలని ఆర్సీబీ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

గత సీజన్‌లో గాయపడిన దేవదత్‌ పాడిక్కల్‌ స్థానంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మయాంక్‌ అగర్వాల్‌ను నియమించుకుంది. అతను 2025లో ఆర్సీబీ తరపున నాలుగు మ్యాచ్‌లు ఆడాడు, 148.43 స్ట్రైక్‌ రేట్‌తో 95 పరుగులు చేశాడు. తదుపరి సీజన్‌కు పాడిక్కల్‌ అందుబాటులో ఉంటాడు, కాబట్టి వేలానికి ఎక్కువ డబ్బు సంపాదించడానికి జట్టు మయాంక్‌ను విడుదల చేయడాన్ని మొగ్గు చూపే అవకాశం ఉంది. మయాంక్‌ అగర్వాల్‌ రికార్డులో ఐదు జట్లకు 131 మ్యాచ్‌లు ఉన్నాయి, 2,756 పరుగులు చేశాడు. అతను ఒక సెంచరీ మరియు 13 హాఫ్‌ సెంచరీలు చేశాడు. దక్షిణాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్‌ లుంగి ఎంగ్డి మంచి బౌలర్‌, కానీ అతను పెద్దగా ప్రభావం చూపలేదు. అతన్ని మొదట చెన్నై, తరువాత ఢల్లీి క్యాపిటల్స్‌ 50 లక్షలకు కొనుగోలు చేశాయి. గత ఎడిషన్‌కు ముందు, అతన్ని బెంగుళూరు 1 కోటి రూపాయలకు కొనుగోలు చేసింది. ఇది అతని బేస్‌ ప్రైస్‌. అయితే, అతను మొత్తం సీజన్‌లో కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు, 4 వికెట్లు తీసుకున్నాడు. రికార్డుల గురించి చెప్పాలంటే, 2018 నుంచి ఆడుతున్న లుంగి ఎంగ్డీ 16 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు, ఏ సీజన్‌లోనూ అతను అన్ని మ్యాచ్‌లు ఆడలేదు. ఆ మ్యాచ్‌లలో అతనికి 29 వికెట్లు ఉన్నాయి.బెంగుళూరు వేలానికి ముందు అతన్ని విడుదల చేయవచ్చు. లియామ్‌ లివింగ్‌స్టోన్‌ 49 మ్యాచ్‌లలో ఏడు హాఫ్‌ సెంచరీలతో సహా 1051 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్‌ రేట్‌ 158.76, 13 వికెట్లు కూడా తీసుకున్నాడు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News