Tuesday, March 17, 2026
Homeస్పోర్ట్స్RCB | ఆర్.సి.బీ. అభిమానులకు గుడ్ న్యూస్..

RCB | ఆర్.సి.బీ. అభిమానులకు గుడ్ న్యూస్..

  • బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచులు..

ఐపీఎల్‌ ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న వేళ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) అభిమానులకు శుభవార్త చెప్పింది. బెంగళూరులోని ప్రఖ్యాత చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నిరుడు ఆర్‌సీబీ టైటిల్‌ గెలిచాక నిర్వహించిన విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్నస్వామిలో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందిన నేపథ్యంలో ఈ ఏడాది అక్కడ మ్యాచ్‌ల నిర్వహణపై అనిశ్చితి కొనసాగింది.

అయితే ఇక్కడ మ్యాచ్‌లను నిర్వహించేందుకు గాను ప్రభుత్వం నియమించిన ఎక్స్‌పర్ట్‌ కమిటీ.. స్టేడియంలో కేఎస్‌సీఏ, ఆర్‌సీబీ తీసుకుంటున్న క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌, భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో రాష్ట్ర హోంమంత్రి జి. పరమేశ్వర చిన్నస్వామిలో మ్యాచ్‌ల నిర్వహణకు ఆమోదముద్ర వేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఈనెల 28న మొదలుకానున్న ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌, ఆర్‌సీబీ)తో పాటు బెంగళూరు జట్టు మరో నాలుగు హోంమ్యాచ్‌లను ఇక్కడే ఆడుతుంది. దీంతోపాటు ఒక ప్లేఆఫ్‌, ఫైనల్‌ కూడా బెంగళూరులోనే నిర్వహించే అవకాశాలున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News