Tuesday, October 28, 2025
ePaper
Homeస్పోర్ట్స్ఐపీఎల్ విజేత ఆర్సీబీ

ఐపీఎల్ విజేత ఆర్సీబీ

ఐపీఎల్ విజేతగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) నిలిచింది. 18 ఏళ్ల కలను నిజం చేసుకుంది. మొట్టమొదటిసారిగా ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. మంగళవారం (జూన్ 3) రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించింది. పోటాపోటీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 రన్నుల తేడాతో విక్టరీ కొట్టింది. బెంగళూరు 191 రన్నులు టార్గెట్ పెట్టగా పంజాబ్‌ 184/7 వద్దే ఆగిపోయింది. దీంతో తొలిసారి టైటిల్‌‌ను చేజిక్కించుకోవాలనుకున్న ఆ జట్టు ఆశలు నెరవేరలేదు. ఐపీఎల్ కప్ గెలవాలన్న లక్ష్యాన్ని బెంగళూరు 18వ సీజన్‌లో అందుకుంది. ఆర్సీబీ ఐపీఎల్ విన్నర్‌గా నిలవటంతో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఎమోషన్ ఫీలయ్యాడు. ఆనంద భాష్పాలతో కొద్దిసేపు అలాగే గ్రౌండ్‌లో కూర్చుండిపోయాడు. కాసేపటి తర్వాత సహచరులతో కలిసి విజయాన్ని ఆస్వాదించాడు. మైదానం మొత్తం కలియతిరిగాడు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News