Thursday, February 12, 2026
Homeస్పోర్ట్స్చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా

చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా

రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) చరిత్రలో 100 వికెట్లతో పాటు 2000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచాడు. ఐదు టెస్ట్‌ల అండర్సన్‌-సచిన్‌ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో హాఫ్‌ సెంచరీ చేయడం ద్వారా జడేజా ఈ ఫీట్‌ సాధించాడు. ఈ మ్యాచ్‌లో జడేజా తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. 137 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 89 పరుగులు చేశాడు. శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి 6వ వికెట్‌కు 203 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ క్రమంలో డబ్ల్యూటీసీలో 2000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 2021లో డబ్ల్యూటీసీ ప్రారంభమవ్వగా..ఇప్పటి వరకు 41 మ్యాచ్‌లు ఆడిన జడేజా 25.92 సగటుతో 132 వికెట్లు తీయడంతో పాటు 2000 ప్లస్‌ రన్స్‌ చేశాడు. మరే ఆటగాడు కూడా ఈ ఫీట్‌ సాధించలేదు. డబ్ల్యూటీసీలో జడేజా ఇప్పటి వరకు మూడు సెంచరీలు చేశాడు. బౌలింగ్‌లో ఆరు సార్లు 5-వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో సెంచరీ దిశగా సాగిన జడేజాను జోష్‌ టంగ్‌ షార్ట్‌ పిచ్‌ డెలివరీతో కీపర్‌ క్యాచ్‌గా పెవిలియన్‌ చేర్చాడు. 310/5 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌ లంచ్‌ బ్రేక్‌ సమయానికి 6 వికెట్లకు 419 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్‌ గిల్‌(168 బ్యాటింగ్‌)తో పాటు వాషింగ్టన్‌ సుందర్ (1 బ్యాటింగ్‌) ఉన్నారు. తొలి సెషన్‌లో భారత్‌ 25 ఓవర్లు ఆడి ఒకే ఒక్క వికెట్‌ కోల్పోయి 109 పరుగులు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News