ఆటలో పరిచయం.. ప్రేమతో పరిణయం..
ఆంధ్రా అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి..
పెద్దల అంగీకారం.. అరుదైన వివాహం..
కరీంనగర్, నవంబర్ 24 (ఆదాబ్ హైదరాబాద్ ): ఆంధ్రా అమ్మాయి(andhra girl).. తెలంగాణ అబ్బాయి(Telangana Boy).. పబ్జీ కలిపింది ఇద్దర్ని. ఆట(Game)లో ఏర్పడ్డ పరిచయం, స్నేహం (Friendship) ప్రేమ(Love)గా మారి పెళ్లిపీటల (Wedding) వరకు వచ్చింది. ఇరువైపుల పెద్దల అంగీకారంతో సోమవారం అంగరంగ వైభవంగా వివాహం (Marriage) జరిగింది.
తెలంగాణలోని చొప్పదండి నియోజకవర్గం బోయిన్‌పల్లికి చెందిన నల్లగొండ రాకేష్‌కి, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కొండి కందుకూరుకు చెందిన హిమబిందుకి పబ్జీ గేమ్ అంటే ఇష్టం. ఆటలో భాగంగా ఇద్దరికీ పరిచయం ఏర్పడి, అభిరుచులు కలిసి, ప్రేమలో పడ్డారు. ఇది రెండు కుటుంబాల పెద్దలకు తెలిసి ఇరువురి తల్లితండ్రుల ఒప్పందంతో బోయినపల్లిలో సంప్రదాయబద్ధంగా పెళ్లిచేశారు. ఈ శుభకార్యానికి దాదాపు వెయ్యి మంది అతిథులు హాజరవటం విశేషం.
