చేవెళ్ల సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం అత్యంత విషాదకరం. మీర్జాగూడ సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టానికి కారణమైన తీరు మనస్సును కలచివేస్తోంది. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నా సంతాపం తెలియజేస్తున్నాను. బాధిత కుటుంబ సభ్యులు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకుని మనోధైర్యంతో నిలవాలని దేవుని ప్రార్థిస్తున్నాను. అలాగే, ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. రోడ్డు భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేయాలని, ఇటువంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
- Advertisement -
