మిలిటరీ విభాగంలో ఎన్నో సంవత్సరాలుగా కీలకమైన సేవలు అందిస్తూ, ఆపరేషన్ సింధూర్లో సైతం తన వంతు పాత్ర పోషించి పలు జాతీయ అవార్డులు పొందిన తెలుగు బిడ్డ రామారం విజయ్ కుమార్ కి పదోన్నతి లభించింది. భారత దేశంలోని అన్ని పోలీసు శాఖలు, ఆర్మీ, పారామెరిటరీ మరియు విదేశాలకు సైతం పంపిణీ చేసే టియర్ స్మోక్ విభాగంలో రావడం విశేషం. ఈ యొక్క ర్యాంకు డిఐజే ప్రకాష్ బరోదరే చేతుల మీదుగా అందుకోవడం చాలా సంతోషాన్నిస్తుందని విజయ్ తెలిపాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని డిఐజి బాదల్, జిఎం తోమర్, డిప్యూటీ జిఎం హిమాన్షు, ఏసి వైభవ్ కుమార్ పాతక్, ఆఫీసర్లు, ఎస్ఓ లు, సహచరులు మరియు ఇతర సైనికులు విజయ్ కుమార్ ని అభినందించారు.

