ఇండియా వద్ద ఉన్న అధునాతన క్షిపణి సామర్థ్యాల నుంచి శత్రు దేశం తప్పించుకోవటం అసాధ్యమని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పరోక్షంగా పాకిస్థాన్‌ను హెచ్చరించారు. ఆ దేశంలోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలోనే ఉందన్న సంగతిని మర్చిపోవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ ఒక శాంపిల్ మాత్రమేనని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్‌ను సందర్శించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ తయారుచేసిన తొలి విడత బ్రహ్మోస్ క్షిపణులను ఆయన సైన్యానికి అందించారు. రాజ్‌నాథ్‌సింగ్ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు.
