Monday, April 13, 2026
Homeస్పోర్ట్స్RR | చిక్కుల్లో రాజస్థాన్ టీం మేనేజర్..

RR | చిక్కుల్లో రాజస్థాన్ టీం మేనేజర్..

  • డగౌట్ లో సెల్ఫోన్ వాడిన రోమీ..
  • నోటీసులు జారీ చేసిన బీసీసీఐ..

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టీమ్ మేనేజ‌ర్ రోమి బింద‌ర్ చిక్కుల్లో ప‌డ్డారు. గ‌త శుక్ర‌వారం ఆర్సీబీతో మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఆయ‌న డ‌గౌట్‌లో సెల్‌ఫోన్‌తో క‌నిపించారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల బీసీసీఐ సీరియ‌స్‌గా ఉంది. రోమి బింద‌ర్‌కు ఇవాళ బీసీసీఐ నోటీసులు జారీ చేసింది. ప్రోటోకాల్ ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డిన‌ట్లు బింద‌ర్‌పై ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. టీమ్ డ‌గౌట్‌లో ప్లేయ‌ర్లు ఉండే ప్ర‌దేశంలో మేనేజ‌ర్ రోమి బింద‌ర్ సెల్‌ఫోన్ చూస్తున్న‌ట్లు దృశ్యాలు రిలీజ్ అయ్యాయి. ప‌క్క‌నే కూర్చుకున్న వైభ‌వ్ సూర్య‌వంశీ .. అత‌ని ఫోన్‌ను తీక్ష‌ణంగా చూస్తున్న‌ట్లు ఆ వీడియోలో ఉన్న‌ది. సోష‌ల్ మీడియాలో ఈ వీడియో వైర‌ల్ కావ‌డంతో వివాదం ముదిరింది. దీనిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మాజీ ఐపీఎల్ చైర్మెన్ ల‌లిత్ మోదీ కూడా డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News