Saturday, October 4, 2025
ePaper
Homeరాజకీయంరాజాసింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు

రాజాసింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అసదుద్దీన్‌ దేశం వదిలిపోయేలా చేస్తామని ఘాటు వ్యాఖ్యలు

బీజేపీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎంఐఏం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ దేశం వదిలిపోయేలా చేస్తామని హెచ్చరించారు. లేదా నేను బీజేపీలో జాయిన్‌ అవుతానని అసదుద్దీన్‌ ఒవైసీ తమ నేతల కాళ్లు పట్టుకుంటారని ఎద్దేవా చేశారు. రంజాన్‌ సందర్బంగా అసదుద్దీన్‌ ఒవైసీ లేనిపోని కామెంట్స్‌ చేస్తున్నారని మండిపడ్డారు. యూపీ తరహాలో తెలంగాణలో కూడా జమ్మికి నమాజ్‌ చేస్తే బాగుంటుంది అన్న యోగి ఆదిత్య నాథ్‌ మాటలకు అసదుద్దీన్‌ ఓవైసీకి కౌంటర్‌ ఇచ్చారు. నిన్న హోలీ ప్రశాంతంగా జరగకుడదని అసద్దుద్దీన్‌ ఒవైసీ కుట్ర చేశారని ధ్వజమెత్తారు. కమ్మ్యూనల్‌ వయొలెన్స్‌ చేసి రాజకీయ లబ్ధి పొందాలని అసదుద్దీన్‌ ఒవైసీ చూస్తున్నారని రాజాసింగ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసదుద్దీన్‌ ఒవైసీ మెంటల్‌ అయిపోయిండు.. రేవంత్‌ రెడ్డి గారు మీ కొత్త దోస్తులకు మెంటల్‌ హాస్పిటల్లో ట్రీట్మెంట్‌ చేపియండి’ అని రాజాసింగ్‌ సెటైర్లు గుప్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News