కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై లోక్‌సభ (Lok Sabha) ప్రతిపక్ష నేత (Opposition Leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమైన విషయమని ఆవేదన (Anguish) వ్యక్తం చేశారు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయాలని సూచించారు.
