Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeజాతీయంరేపు రాధాకృష్ణన్‌ ప్రమాణం చేసే ఛాన్స్‌

రేపు రాధాకృష్ణన్‌ ప్రమాణం చేసే ఛాన్స్‌

  • రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లు
  • హాజరుకానున్న మోడీ తదితరులు
  • మహా గవర్నర్‌గా రాజీనామా..
  • గుజరాత్‌ గవర్నర్‌కు అదనపు బాధ్యతలు
  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ముర్ము

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్‌ శుక్రవారం ప్రమాణం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఆయన ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేస్తారు. బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది. సీపీ రాధాకృష్ణన్ 17వ భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉపరాష్ట్రపతి చేత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అందుకోసం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లు చురుగ్గా పూర్తి చేశారు. ప్రాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితర కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, ఇతర విఐపిలు హాజరయ్యే అవకాశం ఉంది. భారత ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ దన్‌ఖడ్‌ రాజీనామా చేశాక జరిగిన ఎన్నికల్లో రాధాకృష్ణన్‌ విజయం సాధించారు.

సెప్టెంబర్‌ 9వ తేదీన జరిగిన ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ 148 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా.. జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి. ఇక బీఆర్‌ఎస్‌, బీజేడీ, ఎస్‌ఎల్‌డీలు ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. మరోవైపు మహారాష్ట్ర గవర్నర్‌ పదవికి సీపీ రాధాకృష్ణన్‌ రాజీనామా చేసారు. మహారాష్ట్ర గవర్నర్‌ పదవి నుంచి సి.పి.రాధాకృష్ణన్‌ వైదొలిగారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్‌ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో.. గవర్నర్‌ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌కు మహారాష్ట్ర గవర్నర్‌గా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఇకపోతే తాను రాజీపడని జాతీయవాదినని నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సి.పి.రాధాకృష్ణన్‌ చెప్పారు. బుధవారం ముంబయిలోని రాజ్‌భవన్‌లో సత్కారం అందుకున్నారు. గవర్నర్‌గా ఇక్కడ కొనసాగిన 13 నెలలు.. ప్రజాజీవితంలో తనకెంతో సంతోషకరమైన సమయమని, ఆ మధుర స్మృతులను దిల్లీకి తీసుకువెళ్తున్నానని ఆయన చెప్పారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ స్ఫూర్తిదాయక గాథల్ని మా తల్లి చెబుతుండేది. విదేశీ దురాక్రమణదారులపై శివాజీ పోరాడినట్లే దేశంలో అణచివేతపై అంబేడ్కర్‌ పోరు సాగించారు. అలాంటి దార్శనికుల వల్లనే ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ మనుగడ సాగిస్తోంది. ఇదిలావుంటే ఇండియా కూటమి తరఫున పోటీచేసి ఓడిపోయిన జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి రాధాకృష్ణన్‌ను కలిసి అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News