Friday, March 6, 2026
Homeమెదక్‌Fisheries | ఉచిత చేప పిల్లల సప్లైలో తప్పనిసరిగా నాణ్యత పాటించాలి

Fisheries | ఉచిత చేప పిల్లల సప్లైలో తప్పనిసరిగా నాణ్యత పాటించాలి

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్య కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ మాజీ డైరెక్టర్ తేలు ఇస్తారీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లల సప్లైకు భారీ మొత్తంలో నిధులు కేటాయించినా కాంట్రాక్టర్ల చేతుల్లో నాణ్యత లేని చేప పిల్లలు సరఫరా అవుతున్నాయన్నారు. జిల్లాలో మొత్తం మత్స్య సొసైటీలు మూడువందల డెబ్బై తొమ్మిది ఉండగా, వారికి ముందస్తుగా సమాచారం ఇచ్చి ప్రభుత్వ మార్గదర్శకాలు, నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా అమలు చేసేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మత్స్యకారుల జీవనోపాధి దయనీయంగా ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన ప్రణాళికలు లేవని విమర్శించారు.

చైనా, వియత్నం తరహాలో మత్స్య సంబంధిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం మన రాష్ట్రంలో కూడా ఉందని, వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మత్స్యకారులకు మద్దతు ధర, రుణ సౌకర్యాలు, ఇన్సూరెన్స్ పెంపు, చేపల మార్కెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ సహా జిల్లాలోని రిజర్వాయర్ల వద్ద చేపల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదాయ వృద్ధికి చర్యలు తీసుకోవాలని అన్నారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ఈనెల 25, 26 తేదీల్లో కరీంనగర్ లో జరుగనున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చింతల రమేష్, అరవింద్ ముదిరాజ్, సుధాకర్, పడిగే ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News