ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దంపతులు యాదాద్రిలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. పీవీ సింధు దంపతులు స్వామి వారి నిత్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన పూజలోనూ పీవీ సింధు దంపతులు పాల్గొన్నారు. అనంతరం వారికి అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
DEVOTIONAL: యాదాద్రిలో పీవీ సింధు దంపతులు
RELATED ARTICLES
- Advertisment -
