చిట్యాల :- రైస్ మిల్లర్స్ ధాన్యం కొనుగోలు విషయంలో అలసత్వం వహించరాదు అని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నాడు చిట్యాల పట్టణంలోనీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరా రైస్ ఇండస్ట్రీస్ మిల్లు,పట్టణంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేసి మాట్లాడుతూ రైస్ మిల్లర్స్ ధాన్యం కొనుగోలు విషయంలో అలసత్వం జరుగుతుందని ఫిర్యాదు రావడం జరిగింది ఫిర్యాదు మేరకు రైస్ ఇండస్ట్రీని తనిఖీ చేసి యాజమాన్యంతో వివరాలు అడగగా ధాన్యం లో మట్టి పెడ తాలు, తేమశాతం రాకపోవడంతో ఇబ్బందికరమైన విషయం ఏర్పడిందని అన్నారు.
ధాన్యం విషయంలో సమస్య ఉంటే పరిష్కరించే ప్రయత్నం చేసి త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. ధాన్యం కొనుగోలు సెంటర్లో ధాన్యం తేమశాతం పరీక్ష చేసి మిల్లర్స్ కు పంపించాలని ధాన్యం కొనుగోలు స్పీడ్ పెంచాలని అన్నారు. అనంతరము చిట్యాల తహసిల్దార్ కార్యాలయంలో భూభారతికి సంబంధించిన రికార్డులను,పెండింగ్ ఫైల్స్ ను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ అశోక్ రెడ్డి,ఇంచార్జ్ ఎమ్మార్వో విజయ చిట్యాల సింగిల్ విండో చైర్మన్ సుంకరి మల్లేష్ గౌడ్, ఆర్ ఐ లు జానీ షరీఫ్,అమర్నాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
