Monday, October 27, 2025
ePaper
Homeతెలంగాణఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాహాయం అందించండి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాహాయం అందించండి

  • మంత్రిని కోరిన గంగపుత్ర హౌసింగ్ డైరెక్టర్ టంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర

హైదరాబాద్ లోని తెలంగాణ సచివాలయములో తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట కార్యదర్శి వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ టంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా క‌లిశారు. సాంప్రదాయ మత్యకార గంగపుత్రులు కేవలం చేపల వేటే కుల వృత్తిగా జీవనం సాగిస్తూ పేదరికంలో ఉన్న వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీలోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుటకు ఐదు లక్షల ప్రభుత్వ ఆర్థిక సహాయము అందించాల‌ని, తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ గంగపుత్ర ద్వార మంత్రికి విన‌తి ప‌త్రం అందించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. మెట్టు సాయికుమార్ గంగపుత్రకు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీ పాలకమండలి తరుపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News