Wednesday, March 4, 2026
Homeఆరోగ్యంInfant | శిశువును సంరక్షిస్తే ఆరోగ్యకర సమాజం

Infant | శిశువును సంరక్షిస్తే ఆరోగ్యకర సమాజం

నేడు శిశు సంరక్షణ దినం

నవజాత శిశువు సంరక్షణ మనందరి బాధ్యత. బిడ్డ సురక్షితంగా, ఆరోగ్యం(Healthy)గా ఎదగడానికి తల్లితండ్రులు(Parents), కుటుంబ సభ్యులు(Family Members), సమాజం(Society), ప్రభుత్వాలు (Governments) సమిష్టి బాధ్యత వహించాలి. అప్పుడే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది. శిశు ఆరోగ్య ప్రాధాన్యాన్ని గుర్తించిన అమెరికా, యూరోప్‌ దేశాలు 1990ల్లోనే ‘శిశు సంరక్షణ దినం’ (Infant Protection Day) ప్రారంభించాయి. ఏటా నవంబర్‌ 7న ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్నారు. అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లో నేటికీ నవజాత శిశు మరణాల రేటు అధికంగా నమోదవుతుండటం కలవరపరుస్తోంది. శిశువులో రోగ నిరోధకశక్తి (Immunity) పెంచడం, సరైన సమయాల్లో టీకాలు (Vaccines) ఇప్పించడం, పోషకాహారాన్ని అందించడం, ఇంటి పరిసరాల్లో పారిశుద్ధ్యం పాటించడం, తరుచుగా పిల్లల వైద్యుల సలహాలను తీసుకోవడం, పిల్లల పెంపకం పట్ల అవగాహన కల్పించడం లాంటి లక్ష్యాలతో శిశు సంరక్షణ దినం పాటించడం జరుగుతోంది.

- Advertisement -

2025 ఇతివృత్తం‌ (Theme)

ఈ ఏడాది శిశు సంరక్షణ దినం ఇతివృత్తం.. ‘శిశువుల సంరక్షణ, పెరుగుదల, సంపూర్ణ అభివృద్ధి’. తల్లితండ్రులు ఆదర్శ జీవన విధానాలను పాటించడం, పిల్లల నిద్రను నియంత్రించడం, సమయానుకూలంగా పాలు పట్టడం, చిన్నారుల భౌతిక క్రియలకు లేదా ఆటలకు ఆస్కారం ఇవ్వడం వంటివి చేస్తే నేటి శిశువులు రేపటి ఆరోగ్యకర తరంగా మారతారని నమ్మాలి. భారత్‌లో శిశు మరణాల రేటును (ప్రతి వెయ్యి మందికి 30 మంది) 30లోపుకు తగ్గించడానికి ప్రభుత్వాలు ప్రణాళికలు అమలుపరుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ కుటుంబ ఆరోగ్య, సంక్షేమ శాఖ యూనిసెఫ్‌‌తో కలిసి నేషనల్‌ నియోనాటాలజీ ఫోరం ఏటా నవంబర్‌ 15-21 తేదీల్లో వారోత్సవాలను నిర్వహిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News