పటాన్‌చెరు (Patancheru) డివిజన్ పరిధిలోని సాకి చెరువు, అల్విన్ కాలనీ, నేతాజీ నగర్, శ్రీనగర్ కాలనీ, ఇంద్రేశం ప్రాంతాల్లో ఉత్తర భారతీయులు (North Indians) ఘనంగా నిర్వహించిన ఛఠ్ పూజ మహోత్సవాల్లో బీఆర్ఎస్ (Brs) నాయకుడు, MDR ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు మాదిరి ప్రిథ్వీరాజ్( Madiri Prithviraj) పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు సూర్యదేవుడు, ఉషా దేవికి నమస్కారాలు చేస్తూ నదీ, చెరువు తీరాల్లో భక్తిపరవశంతో పూజలు నిర్వహించారు. సూర్యాస్తమయం నుంచి ఉదయ సూర్యుడికి అఘ్ర్యం సమర్పించడం ద్వారా నాలుగు రోజుల పాటు జరిగే ఈ పూజలో శుద్ధత, నియమం, ఆత్మ నియంత్రణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు.
కుటుంబ (Family) సుఖశాంతి, ఆరోగ్యం (Health), సాఫల్యం కోసం ఉత్తర భారతీయులు ఛఠ్ పూజను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ ఛఠ్ పూజ మన సమాజంలోని ఆధ్యాత్మికత, కుటుంబ బంధాలు, పర్యావరణ ప్రేమను ప్రతిబింబించే అద్భుతమైన పండుగ అని చెప్పారు. పటాన్‌చెరు నియోజకవర్గం ‘మినీ ఇండియా’(Mini India)గా ప్రసిద్ధి చెందిందని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ప్రిథ్వీరాజ్ ఉత్తర భారతీయ సోదర సోదరీమణులకు ఛఠ్ పూజ శుభాకాంక్షలు తెలిపారు.
