- యువ క్రీడాకారులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక ప్రోత్సాహం
సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రధానమంత్రి క్రీడల మహోత్సవానికి యువత,మహిళలు,క్రీడాకారులు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని భారతీయ జనతా పార్టీ మహంకాళి–సికింద్రాబాద్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు గుండగోని భరత్ గౌడ్,మేకల సారంగపాణి తెలిపారు.
క్రికెట్,వాలీబాల్,కబడ్డీ,మ్యూజికల్ చైర్స్,100 మీటర్లు,200 మీటర్ల పరుగులు వంటి పోటీలకు ఉత్సాహంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు.యువతలోని క్రీడా నైపుణ్యాలను వెలుగులోకి తీసుకురావడంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, క్రీడాకారులకు తగిన శిక్షణ,ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.ఓయూ గ్రౌండ్‌లో నిర్వహించిన పోటీల్లో గెలిచినవారితో పాటు ఓడిన క్రీడాకారులను కూడా ప్రోత్సహిస్తూ బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.
