Saturday, October 4, 2025
ePaper
Homeజాతీయంవిమాన ప్రమాద స్థలాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

విమాన ప్రమాద స్థలాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

నిన్న అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలి 265 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రదేశాన్ని ప్రధాని మోదీ ఇవాళ (జూన్ 13 శుక్రవారం) సందర్శించారు. అక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రధాని వెంట పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు ఉన్నారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES
- Advertisment -

Latest News