Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeఆంధ్రప్రదేశ్యోగాంధ్రకు ప్రధాని మోదీ ప్రశంసలు

యోగాంధ్రకు ప్రధాని మోదీ ప్రశంసలు

ఏపీలో యోగా దినోత్సవం పట్ల ప్రజలు చూపుతున్న ఉత్సాహాన్ని గమనిస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని పీఎం మోదీ అన్నారు. యోగాంధ్ర 2025 పేరుతో యోగాకు ప్రాచుర్యం కల్పించేందుకు ఏపీ ప్రజలు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. ఈ నెల 21న ఏపీలో యోగా దినోత్సవం జరుపుకొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ప్రతిఒక్కరూ యోగా దినోత్సవంలో పాల్గొని, యోగాను డైలీ లైఫ్‌లో భాగం చేసుకోవాలని సూచించారు.

చిత్తూరు సమీపంలోని పులిగుండు ట్విన్‌హిల్స్‌లో 2 వేల మందికి పైగా ప్రజలు యోగాసనాలు వేస్తున్న ఫొటోలను కేంద్ర ఆయుష్‌ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావ్‌ జాదవ్‌ ‘ఎక్స్‌’లో షేర్‌ చేయగా వాటిని ప్రధాని రీట్వీట్‌ చేశారు. లైఫ్ స్టైల్‌లో యోగాను ఒక భాగంగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఏపీలోని కూటమి ప్రభుత్వం యోగాంధ్ర-2025 కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టింది.

గత నెల 21 నుంచి ఈ నెల 21 వరకు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో యోగాపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తక్కువలో తక్కువగా 2 కోట్ల మంది పాల్గొనేలా చూడాలని సంకల్పంగా పెట్టుకున్నారు. 10 లక్షల మందికి పైగా ప్రజలకు యోగా సర్టిఫికెట్లు ప్రదానం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News