- ఘనంగా స్వాగతించిన భారత సంతతి ప్రజలు.. డిసెంబర్ 15 నుంచి 18 వరకు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ మూడు దేశాల్లో పర్యటన
భారతీయ సంతతి భారత్-జోర్డాన్ సంబంధాలకు గణనీయమైన కృషి చేస్తున్నారని భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధాని మోదీకి జోర్డాన్ రాజధాని అమ్మాన్ భారతీయ సంతతి నుంచి అపూర్వ స్వాగతం లభించింది. మూడు దేశాల పర్యటనలో భాగంగా సోమవారం మొదటి జోర్దాన్‌కు చేరుకున్న ప్రధాని మోదీని హోటల్ వద్ద జోర్డాన్‌లోని భారత సంతతికి చెందిన వారు భారత జాతీయ జెండాను చేతబట్టి ప్రధాని మోదీకి నమస్కరించి స్వాగతం చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని వారిని ప్రేమతో పలుకరించారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ డిసెంబర్ 15 నుంచి 18 వరకు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ మూడు దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటన ద్వారా ఆయా దేశాలతో పురాతన సంస్కృతిక సంబంధాలతో పాటు ఆధునిక ద్వైపాక్షిక భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాలన్నది ప్రధాని పర్యటన ప్రధాన లక్ష్యం. ప్రధాని మోదీ.. జోర్డాన్ సందర్శన భారత్-జోర్డాన్ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరుగుతోంది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ.. జోర్డాన్ రాజు అబ్దుల్లా ఎఎ ఇబ్న్ అల్ హుస్సేన్, ఆ దేశ ప్రధాని జాఫర్ హసన్‌లతో భేటీ కానున్నారు. జోర్డాన్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటిస్తారు.
