Thursday, February 26, 2026
HomeజాతీయంPresident | గగనవిహారం చేయనున్న రాష్ట్రపతి..

President | గగనవిహారం చేయనున్న రాష్ట్రపతి..

  • రాజస్థాన్ పర్యటించనున్న ద్రౌపతి ముర్ము..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా శుక్రవారం ఆమె జైసల్మేర్ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్‌ ‘ప్రచండ్‌ లో గగన విహారం చేయనున్నారు. అనంతరం భారత్‌ – పాకిస్థాన్‌ సరిహద్దు సమీపంలోని పోఖ్రాన్‌లో వైమానిక దళం ఆధ్వర్యంలో ‘వాయు శక్తి’ పేరిట నిర్వహించనున్న విన్యాసాలను వీక్షించనున్నారు.

ఎల్‌సీహెచ్‌ ‘ప్రచండ్‌’ అనేది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి యుద్ధ హెలికాప్టర్‌. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL) ఈ యుద్ధ హెలికాప్టర్‌ను తయారుచేసింది. 2022 అక్టోబర్‌లో దీన్ని వాయుసేనలోకి ప్రవేశపెట్టారు. ఎడారుల నుంచి పర్వతాల వరకు విభిన్న ప్రాంతాల్లో దీన్ని నడపవచ్చు. ఈ హెలికాప్టర్‌ 5,000 మీటర్ల పైన ఎత్తులోనూ ఎగరగలదు. ముఖ్యంగా పర్వత ప్రాంత సరిహద్దుల వెంట మోహరింపునకు ఇది అనుకూలంగా ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News