వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని విస్డం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు అట్టహాసంగా విద్యార్థినీ విద్యార్థుల నృత్యాలు, పాటలు, రంగవల్లుల మధ్య జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం పాఠశాలలో అన్ని రకాలైన సాంస్కృతిక కార్యకలాపాలు విద్యార్థులకు నిర్వహిస్తూ…వారిలో మన పండుగల పట్ల మన భారతీయ సంస్కృతి పట్ల అవగాహన కల్పిస్తామని పాఠశాల ప్రిన్సిపాల్ అనుమాండ్ల దేవేందర్ అన్నారు. విద్యార్థులతో కలిసి భోగి మంటలు వేసి, సంక్రాంతి పండుగ గొప్పదనాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులకు వివరించారు. బాలికలకు ముగ్గుల పోటీలు, బాలురకు చిత్రలేఖన పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు సుధాకర్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు సునీత, హర్షిత, ఇంద్రజ, సుమలత, స్వాతి, శ్రీలేఖ పాల్గొన్నారు.
Sankranti | విస్డం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు.
By Aadab Desk
- Advertisement -
Previous article

