Tuesday, February 10, 2026
HomeజాతీయంPPC-2026 | పాన్ ఇండియా స్థాయికి పరీక్షా పే చర్చ

PPC-2026 | పాన్ ఇండియా స్థాయికి పరీక్షా పే చర్చ

ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా భావించే కార్యక్రమం పరీక్షా పే చర్చ(Pariksha Pe Charcha-PPC) ముఖ్యమైన మైలురాయి(Milestone)ని అందుకుంది. ప్రధాని మోదీ(PM Modi) విద్యార్థులతో సంభాషించే ఈ కార్యక్రమం 9వ ఎడిషన్(2026) పాన్ ఇండియా(Pan India) స్థాయికి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు విస్తరించింది. ప్రతి విద్యార్థి వ్యక్తిత్వాన్ని గుర్తించి, పెంపొందించి, భయం లేదా ఒత్తిడి లేకుండా అభివృద్ధి చెందడానికి ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టించడం పరీక్ష పే లక్ష్యం. విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావాలనే ప్రధాని మోదీ దార్శనికతతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంగా ఎదిగింది. సహజంగా ఈ కార్యక్రమాన్ని ఏటా ఢిల్లీలోని ఒకే వేదికగా నిర్వహించేవారు. ఈ సంవత్సరం కొత్త సంప్రదాయానికి తెర తీశారు.

ప్రధాని మోదీ తమిళనాడులోని కోయంబత్తూర్, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, గుజరాత్‌లోని దేవ్ మోగ్రా, అస్సాంలోని గౌహతి విద్యార్థులతో నేరుగా సంభాషించారు. తద్వారా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ ప్రాంతాలతోపాటు దేశానికి హృదయాన్ని లాంటి ఢిల్లీని కూడా ఒకే ఉమ్మడి వేదికపై అనుసంధానిస్తూ మాట్లాడారు. PPC-2026లో పాల్గొన్నవారి సంఖ్య ఈ కార్యక్రమానికి పెరుగుతున్న పరిధి, ప్రజాదరణను ప్రతిబింబించింది. ఈసారి 4.5 కోట్ల మందికి పైగా నమోదు చేసుకోగా అదనంగా 2.26 కోట్ల మంది వ్యక్తులు పరీక్షా పే చర్చకు సంబంధించిన వివిధ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. దీంతో ఈ సంవత్సరం మొత్తం భాగస్వామ్యం 6.76 కోట్లకు పైగా పెరిగింది. పరీక్షా పే చర్చను 2018 నుంచి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News